ప్రజాశక్తి-అమరావతి:విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ కస్టడీ మృతి ఆరోపణల నేపథ్యంలో డిజిపి, విజయవాడ పోలీస్ కమిషనర్, సౌత్‌జోన్ ఎసిపిలను నిందితులుగా చేర్చాలంటూ తిరుపతి ఎంపి మద్దెల గురుమూర్తి దాఖలు చేసిన ప్రైవేట్ ఫిర్యాదుపై విజయవాడ కోర్టు చేపట్టిన తదుపరి చర్యలను హైకోర్టు నిలిపివేసింది. ఫిర్యాదుదారు, సాక్షుల వాంగ్మూలాల నమోదును కూడా నిలిపివే సింది. తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. విచారణ తేదీ వరకూ ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని హైకోర్టు పేర్కొంది. ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ గురుమూర్తికి నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వై. లక్ష్మణరావు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.సాయికృష్ణ అదృశ్యం విషయంలో డిజిపి, విజయవాడ పోలీస్ కమిషనర్, సౌత్‌జోన్ ఎసిపిలపై హత్య, కుట్ర, సాక్ష్యాల మాయం తదితర ఆరోపణల తో గురుమూర్తి విజయవాడ కోర్టులో ప్రైవేట్ ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన రెండో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ ఫిర్యాదుదారు, సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేయాలని నిర్ణయించారు. దీనిని సవాల్ చేస్తూ సౌత్‌జోన్ ఎసిపి కె. మానస హైకోర్టును ఆశ్రయించారు. గురువారం విచారణలో సాయికృష్ణ మృతిపై ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసిందని, దర్యాప్తు కొనసాగుతున్న దశలో ప్రైవేట్ ఫిర్యాదు దాఖలు చేయడం విచారణ ప్రక్రియను దుర్వినియోగం చేయడమేనని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ వాదనలు విన్న న్యాయ మూర్తి సిట్ దర్యాప్తు పురోగతిలో ఉన్నప్పుడు దానికి సమాంతరంగా ప్రైవేట్ ఫిర్యాదుపై విచారణ జరపడం ఆమోదయోగ్యం కాదని, ఇది విచారణ ప్రక్రియను దుర్వినియోగం చేయడమేనని వ్యాఖ్యానించారు.
Print Editionసాయికృష్ణ కస్టడీ మృతి కేసులో ప్రైవేట్ ఫిర్యాదుపై తదుపరి చర్యలు నిలిపివేత
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 13, 2026, 11:24 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)