విచారణకు సుప్రీం అంగీకారం
న్యూఢిల్లీ : జంతర్ మంతర్ నిరసనల్లో ఢిల్లీ పోలీసులు ‘ఫేషియల్ రికగ్నిషన్ (ముఖ గుర్తింపు)’ ను వినియోగించడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు గురువారం అంగీకరించింది. నీట్ పేపర్ లీకేజీలను నిరసిస్తూ ఇటీవల జంతర్‌మంతర్ వద్ద విద్యార్థుల ఆందోళనల సందర్భంగా ఢిల్లీ పోలీసులు ఫేషియల్ రికగ్నిషన్ సాంకేతికతను, ఇతర బయో మెట్రిక్ నిఘా చర్యలను ఉపయోగించడాన్ని వ్యతిరేకిస్తూ సిపిఎం రాజ్యసభ సభ్యులు ఎ.ఎ.రహీమ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. విద్యార్థులపై పోలీసుల అణచివేతను, పెల్లెట్ గన్‌ల వాడకాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రధాన పిటిషన్లతో ఈ పిటిషన్‌ను జత చేస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం సీనియర్ న్యాయవాది మేనకా గురుస్వామి, సుభాష్ చంద్రన్‌లకు తెలిపింది. క్షేత్రస్థాయిలో పోలీసులు నిఘా నిర్వహించారని, ఆ డేటాను ప్రైవేట్ సంస్థల వద్ద భద్రపరిచారని న్యాయవాది మేనకా గురుస్వామి కోర్టుకు తెలిపారు.







కామెంట్‌లు (0)