గురువారం, 13 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionచివరి రోజూ మారని కేంద్రం తీరు

1 గంట క్రితం

loksabha
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 14, 2026, 12:11 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • కీలక అంశాలపై చర్చ లేకుండానే ముగిసిన పార్లమెంట్‌

  • స్పీకర్ టీ పార్టీని బ‌హిష్క‌రించిన ఇండియా ఫోరమ్‌

​​ప్ర‌జాశ‌క్తి-న్యూఢిల్లీ బ్యూరో : పార్లమెంటు సమావేశాల చివరి రోజు కూడా కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏమ్రాతం మారలేదు. దీంతో ప్రతిపక్షాలు లేవనెత్తిన కీలక అంశాలపై ఎటువంటి చర్చ లేకుండానే సమావేశాలు ముగిశాయి. చివరి రోజైన గురువారం కూడా ప్రతిపక్షాల డిమాండ్లను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. రోజుల తరబడి గైర్హాజరైన ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, హోంశాఖ మంత్రి అమిత్‌ ‌షా లోక్‌‌సభకు హాజరు కావడం మినహా చివరి రోజుకూడా ఎటువంటి ప్రత్యేకత కనిపించలేదు. కొద్దిరోజులుగా విమర్శలు ఎదుర్కుంటున్న నేతలిద్దరు కనిపించడంతో సభా కార్యక్రమాల్లో ఎంతోకొంత పురోగతి ఉంటుందని ఆశించిన వారికి తీవ్ర నిరాశే ఎదురైంది. కొద్దిరోజులుగా వెల్లువెత్తుతున్న పరిస్థితులపై ప్రకటనలో, వివరణలో ఉంటాయని అంతకు ముందు పార్లమెంటు లాబీల్లో ఊహాగానాలు వినిపించాయి. అయితే, దానికి భిన్నంగా సభలో జరిగింది. ప్రారంభం కాగానే, వందేమాతర గీతాలాపన చేపట్టారు. సభ్యులందరు తమ సీట్ల నుండి లేచి నిలబడి వందేమాతరాన్ని ఆలాపిం చారు. అనంతర కార్య్రకమాలకు సభ్యులు సిద్ధమౌతుండగానే లోక్‌‌సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ ఓం బిర్లా ప్రకటించారు. సభ జరిగిన తీరును సమీక్షిస్తూ సంప్రదాయంగా చేసే ప్రసంగాన్ని కూడా ఆయన ఈ సారి చేయకపోవడం గమనార్భం. స్పీకర్‌ ‌ప్రకటన వెలువడిన వెంటనే, ప్రధానమంత్రి, హోంమంత్రిలు సభ నుండి నిష్క్రమించారు. దీంతో ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రతిపక్షాలు ప్రధానమంత్రి, హోంమంత్రి భయపడి పారిపోయా యయని వ్యాఖ్యానించాయి. సభా కార్యకలాపాల అనంతరం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఏర్పాటు చేసిన టీ పార్టీని ఇండియా ఫోరమ్‌ ఎంపిలు బహిష్కరించారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ప్రతిపక్షాలను కోరినప్పటికీ, మోడీ, షా హాజరైన టీ పార్టీని బహిష్కరిస్తున్నట్లు ఇండియా ఫోరమ్‌ ‌ప్రకటించింది.

నాపై వివక్ష చూపారు : రాజ్యసభలో ఖర్గే

రాజ్యసభ సమావేశమైన వెంటనే, ప్రతిపక్షాలు నినాదాలు ప్రారంభించాయి. ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే ఉత్తరాఖండ్‌‌లో బిజెపి నేతలు తన పట్ల సామాజిక వివక్షను చూపారని చెప్పారు. హల్ద్వానీలో తాను ఒక ర్యాలీని నిర్వహించానని, అది ముగిసిన అనంతరం బిజెపి ఆ ప్రాంగణాన్ని శుద్ధి చేసిందని ఆయన చెప్పారు. ప్రతిపక్ష నేతయైన తన పట్లే ఇటువంటి వివక్ష ప్రదర్శిస్తే , సామాన్యుల సంగతి ఏంటని ఆయన ప్రశ్నించారు. ‘ఇదేనా ప్రజాస్వామ్యం? రాజ్యాంగాన్ని ఇలాగేనా కాపాడేది? దళితులకు లభించే సమానత్వం ఇదేనా?’ అని ఆయన నిలదీశారు.

దీంతో రాజ్యసభ లో ఉద్విగ్న వాతావరణం నెలకొంది. ప్రతిపక్ష సభ్యులు ఖర్గేకు మద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో రాజ్యసభ నేత జెపి నడ్డా మాట్లాడుతూ ఖర్గే అనుభవం విచారకరమని చెప్పారు. తమ పార్టీ అటువంటి చర్యలను ప్రోత్సహించదని చెప్పారు. అయితే, విపక్ష సభ్యుల నిరసన కొనసాగింది. నిరసనల మధ్యే రాజ్యసభ గనులు, ఖనిజాల (అభివృద్ధి మరియు నియంత్రణ) సవరణ బిల్లును ఆమోదించింది. మంగళవారం లోక్‌సభ ఈ బిల్లును చర్చ లేకుండానే ఆమోదించింది. ఆ వెంటనే రాజ్యసభ నిరవధిక వాయిదా పడింది..


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్