గురువారం, 13 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionమా నియంత్రణ, నిర్వహణలోనే..

1 గంట క్రితం

SHIPPING
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 14, 2026, 12:14 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • హర్మూజ్‌‌పై ఇరాన్‌ స్పష్టీకరణ

​టెహ్రాన్‌ : హర్మూజ్‌ జలసంధి‌లో నౌకలు సాధారణంగా ప్రయాణిస్తున్నాయని, అది తమ నియంత్రణలోనే ఉందని ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు అసత్యాలని ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ పేర్కొన్నారు. ఇరాన్‌‌పై యుద్ధం, ప్రత్యేకించి హర్మూజ్‌ ‌విషయంలో అమెరికా తప్పుడు అంచనాలు వేసుకుందని ఆయన గురువారం స్పష్టం చేశారు. జలసంధిలో నౌకలు సాధారణంగానే పయనిస్తున్నాయని అమెరికా చెబుతున్న వ్యాఖ్యలు తప్పడు, బూటకపు వ్యాఖ్యలు అని ఇరాన్‌ సెంట్రల్‌ మిలటరీ కమాండ్‌ ‌ప్రతినిధి ఇబ్రహీం జుల్పఘరి పేర్కొన్నారు. ఇరాన్‌ ‌నాయకత్వం తరపు నుండి మూడు దశల్లో హర్మూజ్‌‌పై ప్రకటనలు విడుదలయ్యాయి. తదుపరి దశ యుద్ధంలో ఇరాన్‌ మరింత దూకుడుగా వ్యవహరిస్తుందని బ్రిగేడియర్‌ జనరల్‌ రసూల్‌ సనాయి-రాద్‌ తెలిపారు. 'ఇటీవలి యుద్ధంలో మేము చాలా దృఢంగా నిలబడ్డాం. దైవ సంకల్పం ఉంటే భవిష్యత్తులో జరిగే యుద్ధంలో మరింత దృఢంగా, దూకుడుగా నిలబడతాం' అని సుప్రీం నేత ముజ్తాబా కార్యాలయంలో రాజకీయ సలహాదా రుగా పనిచేస్తున్న సనాయి - రాద్‌ పేర్కొన్నారు. ఆర్థిక ఒత్తిళ్ల ద్వారా అంతర్గత విభేదాలు సృష్టిం చాలని శత్రువు భావించిందని, ఆ ఎత్తుగడ ఫలించలేదని అమెరికా పేరును ప్రస్తావించ కుండా ఆయన వ్యాఖ్యానించారు. హర్మూజ్‌ జలసంధి ఇప్పటికీ ఇరాన్‌ నియంత్రణ, నిర్వహణలోనే వుందని ఐఆర్‌జిసి అనుబంధ పారా మిలిటరీ బసిజ్‌ సంస్థ కమాండర్‌ హుస్సేన్‌ తయీబ్‌ కూడా స్పష్టం చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్