శనివారం, 12 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆగి ఉన్న లారీని ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు

18 నిమిషాల క్రితం

bus.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 12, 2026, 08:15 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ఒకరు మృతి, 16 మందికి గాయాలు

ప్రజాశక్తి-ఏలూరు : చింతలపూడిలోని రేచర్ల గ్రీన్‌ఫీల్డ్ హైవే వద్ద శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టైరు పంచర్ కావడంతో రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, 16 మంది గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద ఘటనలో చింతలపూడి సీఐ క్రాంతికుమార్, ఎస్సై సతీష్ దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు, క్షతగాత్రుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

bus 2.jpeg

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్