ఢిల్లీ: బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భారత్‌కు చేరుకున్నారు. శనివారం ఉదయం ఆయన ఢీల్లీకి చేరుకున్నారు. ఏడేళ్ల తర్వాత జిన్‌పింగ్ భారత్ పర్యటనకు రావడం ఇదే తొలిసారి. 2020 గల్వాన్ ఘర్షణల తర్వాత ఢిల్లీ వేదికగా భారత్, చైనా మధ్య జరగనున్న తొలి ఉన్నతస్థాయి సమావేశం ఇదే. బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, జిన్‌పింగ్ మధ్య ద్వైపాక్షిక భేటీ జరగనుంది. ఈ సందర్భంగా ఇరుదేశాల సంబంధాలు, సరిహద్దు అంశాలపై చర్చించే అవకాశం ఉంది.
BRICS Summit:ఢిల్లీకి చేరుకున్న చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్
23 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 12, 2026, 08:10 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)