ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో: ప్రపంచ రాజకీయ, ఆర్థిక రంగాల్లో కీలక శక్తిగా ఎదుగుతున్న బ్రిక్స్ కూటమి 18వ శిఖరాగ్ర సదస్సు శనివారం దేశ రాజధాని ఢిల్లీలో ప్రారంభం కానుంది. ఇండియా, చైనా, రష్యా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, యుఎఇ, ఇండోనేషియా, సౌదీ అరేబియా సహా 11 సభ్య దేశాల అధినేతలు సదస్సుకు హాజరుకానున్నారు. సదస్సులో పాల్గొనేందుకు ఢిల్లీకి చేరుకున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌లతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ శనివారం ఢిల్లీకి చేరుకోనున్నారు. ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపంలో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు జరగనుంది. శనివారం సభ్య దేశాల అధినేతలు ‘సమగ్ర ప్రపంచ పాలన, బహుళపక్ష సహకారాన్ని బలోపేతం చేయడం’ అనే అంశంపై ప్రధానంగా చర్చించనున్నారు. ప్రస్తుత ప్రపంచ రాజకీయ, ఆర్థిక పరిస్థితులను సమీక్షించడంతోపాటు బ్రిక్స్ దేశాల మధ్య సహకారాన్ని మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లే మార్గాలపై చర్చించనున్నారు.
నేటి నుంచి బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు
29 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 12, 2026, 08:03 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)