శుక్రవారం, 10 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

సాంకేతిక లోపంతో నిలిచిన ఎయిరిండియా విమానం

1 గంట క్రితం

Air India
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 10, 2026, 12:28 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

తిరువనంతపురం : కేరళలోని తిరువనంతపురం నుండి బెంగళూరు వెళ్లే ఎయిరిండియా విమానం సాంకేతిక లోపంతో శుక్రవారం ఉదయం నిలిచిపోయింది. ఉదయం 7.05గంటలకు బయలుదేరాల్సిన విమానం ఐఎక్స్‌ 2980, మొదట టేకాఫ్ కోసం వేగాన్ని పెంచినప్పటికీ.. కాసేపటికే వేగం తగ్గడంతో టేకాఫ్‌ను నిలిపివేశారు. సాంకేతిక సమస్య కారణంగా పైలెట్‌ విమానాన్ని వెనక్కి తీసుకురావాల్సి వచ్చిందని విమానాశ్రయ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రయాణికులు ఇంకా విమానంలోనే ఉన్నారని, వారిని బెంగళూరు తరలించేందుకు మరో విమానాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్