- 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రానున్న 24 గంటల్లో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) ఎండీ ప్రకర్ జైన్ తెలిపారు. పోలవరం, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. మరోవైపు, మార్కాపురం, నెల్లూరు, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు పడే అవకాశముందని పేర్కొన్నారు. వర్షాల సమయంలో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం సమయంలో చెట్ల కింద, భారీ హోర్డింగ్స్ సమీపంలో నిలబడవద్దని హెచ్చరించారు. అలాగే, ఈదురుగాలుల కారణంగా విద్యుత్ వైర్లు తెగిపడి ఉంటే వాటికి దూరంగా ఉండాలని సూచించారు.







కామెంట్‌లు (0)