- పిడుగులు, ఈదురుగాలులపై అప్రమత్తంగా ఉండండి
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో బుధవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలతో పాటు రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది. అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే శ్రీకాకుళం, మన్యం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఇక విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ, కృష్ణా, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, అనంతపురం, శ్రీసత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. ప్రజలు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వీచే సమయంలో చెట్లు, హోర్డింగులు, విద్యుత్ స్తంభాల కింద నిలబడవద్దని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.








కామెంట్‌లు (0)