ప్రజాశక్తి -ఉండి : ప్రత్యేక టెట్‌లో సడలింపులు చేయాలని ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి డిమాండ్ చేశారు. 2011కు ముందు విధుల్లో చేరిన ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్‌ను తప్పనిసరి చేయడం వల్ల వేలాది మంది ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వారిని టెట్ నిబంధన నుంచి పూర్తిగా మినహాయించేలా కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలంలోని పలు ఉన్నత పాఠశాలలను సందర్శించిన ఆయన ఉపాధ్యాయులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గోపిమూర్తి మాట్లాడుతూ... ఇప్పటికే ఎన్నో సంవత్సరాలుగా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్న ఉపాధ్యాయులను మరోసారి అర్హత పరీక్ష రాయాలనడం న్యాయసమ్మతం కాదన్నారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వంతో చర్చించి రైట్ టు ఎడ్యుకేషన్ (ఆర్‌టిఇ) చట్టంలోని 23(1) క్లాజును సవరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ సవరణ ద్వారా ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నిబంధన నుంచి పూర్తిగా మినహాయింపు కల్పించాలని డిమాండ్ చేశారు.
Print Editionప్రత్యేక టెట్‌లో సడలింపులు : ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి డిమాండ్
3 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 09, 2026, 10:28 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)