శనివారం, 29 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionగుంటూరు ఛానల్ విస్తరణకు నాలుగో విడత నిధుల విడుదల

1 గంట క్రితం

Guntur Channel.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 29, 2026, 09:06 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - గుంటూరు జిల్లా ప్రతినిధి : గుంటూరు ఛానల్ విస్తరణలో భాగంగా చేపట్టిన పనులకు సంబంధించి సేకరించిన భూములకు నాలుగో విడత పరిహారం శనివారం విడుదలైంది. భూసేకరణ పరిహారానికి సంబంధించి 51 మంది రైతులకుగానూ రూ.17.09 కోట్లు విడుదల చేశారు. గారపాడు, ప్రత్తిపాడు, మల్లాయపాలెం, కొండేపాడు, రావిపాడు గ్రామాలకు సంబంధించిన రైతులకు ఈ పరిహారం విడుదలయ్యాయి. మిగిలిన సుమారు రూ.14 కోట్ల పరిహారాన్ని కూడా త్వరలో విడుదల చేసేలా చర్యలు తీసుకుంటున్నామని డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు ఛానల్ విస్తరణ, పొడిగింపు కోసం భూములు ఇచ్చిన ప్రతి రైతుకు రావాల్సిన పరిహారం అందేలా సంబంధిత అధికారులతో సమన్వయం చేస్తూ, పెండింగ్ చెల్లింపులను త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. రైతుల సహకారంతో చేపడుతున్న గుంటూరు ఛానల్ పనులను వేగిరి పరుస్తున్నట్టు తెలిపారు. ఛానల్ విస్తరణ మొదటి దశ పనులను పూర్తి చేసేందుకు రైతులకు పెండింగ్‌‌లో ఉన్న నిధులు మొత్తం చెల్లించేలా అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్