ఆదివారం, 26 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition​దామోదర నాయుడికి హైకోర్టులో ఊరట

16 జులై, 2026

ap high court
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 16, 2026, 10:25 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • సింగిల్ జడ్జి తీర్పు నిలిపివేత

ప్రజాశక్తి-అమరావతి: పశు సంవర్థక శాఖ డైరెక్టర్ దామోదర నాయుడు పునర్నియామకానికి సంబంధించి హైకోర్టు డివిజన్ బెంచ్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన పునర్నియామకాన్ని రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దామోదర నాయుడికి అవసరమైన అర్హతలు ఉన్నందునే ప్రభుత్వం ఆయనను మళ్లీ డైరెక్టర్‌గా నియమించిందని, ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోకుండా సింగిల్ జడ్జి రిట్ ఆఫ్ కో వారెంటో జారీ చేశారని ధర్మాసనం అభిప్రాయపడింది. అవసరమని భావిస్తే పునర్నియామకం చేసే అధికారం ప్రభుత్వానికి ఉందని పేర్కొంటూ జస్టిస్ దొనడి రమేష్, జస్టిస్ ఆలపాటి గిరిధర్‌ డివిజన్ బెంచ్ గురువారం ఉత్తర్వులు వెలువరించింది. పదవీ విరమణ చేసిన దామోదర నాయుడిని మరో ఏడాది పాటు అదే పదవిలో కొనసాగిస్తూ చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడాన్ని సవాలు చేస్తూ ఏపీ పశువైద్యుల సంఘం, పశు సంవర్థక శాఖ అధికారుల సంఘం, అదనపు డైరెక్టర్ పాముల సత్యకుమారి తదితరులు హైకోర్టును ఆశ్రయించారు. సింగిల్ జడ్జి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయగా, దానిపై దామోదర నాయుడు, రాష్ట్ర ప్రభుత్వం అప్పీళ్లు దాఖలు చేశాయి. వాటిపైనే తాజాగా డివిజన్ బెంచ్ సింగిల్ జడ్జి తీర్పు అమలును నిలిపివేసింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్