మంగళవారం, 28 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionప్రధాని పర్యటనపై సమీక్ష

1 గంట క్రితం

review meating
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 28, 2026, 09:02 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • పలు సూచనలు చేసిన మంత్రులు రామ్మోహన్‌ ‌నాయుడు, లోకేష్‌

ప్రజాశక్తి-భోగాపురం : ప్రధానమంత్రి మోడీ పర్యటనను అన్ని శాఖలు కలిసి సమి‌ష్టిగా విజయవంతం చేయాలని రాష్ట్ర మానవ వనరుల శాఖా మంత్రి నారా లోకేష్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సూచించారు. భోగాపురంలో నిర్మాణమైన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆగస్టు 1న ప్రధాని మోడీ ప్రారంభోత్సవం చేస్తున్న నేపథ్యంలో ఆయన పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను లోకేష్ అధ్యక్షతన జరిగిన సమీక్షలో రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు అనిత, అచ్చెన్నాయుడు, అనగాని సత్య ప్రసాద్, బిసి జనార్ధన రెడ్డి, గుమ్మడి సంధ్యారాణి, కొలుసు పార్థసారథి, గొట్టిపాటి రవికుమార్, కొండపల్లి శ్రీనివాస్, డోలా బాల వీరాంజనేయ స్వామి, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ ఉత్తరాంధ్ర రూపు రేఖలను మార్చేలా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం రూపుదిద్దుకుందని, ఇది "గేట్‌వే ఆఫ్ గ్లోబల్ ఆంధ్రా"గా మారబోతోందని పేర్కొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్