శనివారం, 21 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. మునుగోడు యువకుడు మృతి

16 గంటల క్రితం

Road accident in America; youth from Munugode dies
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 21, 2026, 09:40 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • వారం రోజుల క్రితమే ఉద్యోగం సాధించిన సాయితేజ (25)

హైదరాబాద్‌ : అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నల్గొండ జిల్లా మునుగోడుకు చెందిన యువకుడు మృతి చెందాడు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఈరమళ్ల సాయితేజ (25) రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. మునుగోడుకు చెందిన ఈరమళ్ల ప్రసాద్‌, శ్రీకన్య దంపతుల పెద్ద కుమారుడు సాయితేజ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. వారం రోజుల క్రితమే అక్కడ ఉద్యోగం సాధించాడు. ఈ క్రమంలో కారులో ప్రయాణిస్తుండగా రోడ్డుపైకి జింక అడ్డుగా వచ్చింది. దీంతో జింకను ఢీకొన్న కారు ఆగిపోయింది. వెనుక నుంచి వచ్చిన వాహనాలు సాయితేజ కారును ఢీకొనడంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి.

వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కుమారుడు ఉద్యోగం సాధించాడన్న సంతోషం మరువకముందే అతడి మరణవార్త తెలియడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. సాయితేజ భౌతికకాయం ఆదివారం రాత్రికి మునుగోడుకు చేరుకునే అవకాశం ఉంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్