మంగళవారం, 08 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అదనపు ప్రధాన ఎన్నికల అధికారిగా ఎస్. డిల్లీరావు

03 ఆగస్టు, 2026

ap ceo
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 03, 2026, 11:46 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆంధ్రప్రదేశ్ అదనపు ప్రధాన ఎన్నికల అధికారిగా ఎస్. డిల్లీరావును రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వుల ప్రకారం.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఎస్. దిల్లీరావును రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయంలో అదనపు ప్రధాన ఎన్నికల అధికారిగా బదిలీ చేశారు. ఈ నియామకానికి భారత ఎన్నికల సంఘం ఆమోదం తెలిపినట్లు ప్రభుత్వం పేర్కొంది. అదే సమయంలో, పౌర సరఫరాల కమిషనర్‌గా, ఆ శాఖ ఎక్స్-అఫీషియో కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న కె. కన్నబాబు, రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌తో పాటు లీగల్ మెట్రాలజీ కంట్రోలర్ పదవుల పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ బాధ్యతలు కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ బదిలీ, నియామక ఉత్తర్వులు ఈ నెల 3 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్