ఆదివారం, 27 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఉద్ధృతంగా శబరి, గోదావరి నదులు

51 నిమిషాల క్రితం

sabari.webp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 27, 2026, 12:41 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-పోలవరం : ఎగువన కురుస్తున్న వర్షాలతో పోలవరం జిల్లాలో శబరి, గోదావరి నదులకు వరద ఉద్ధృతి మరింత పెరుగుతోంది. చింతూరు వద్ద శబరి నీటి ప్రవాహం 38 అడుగులకు చేరింది. కూనవరం వద్ద నీటి ప్రవాహం 31 అడుగులకు చేరుకుంది. వరద నీటి కారణంగా జాతీయ రహదారి 326పై రాకపోకలు నిలిపివేశారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. 136 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి, ఆరు లాంచీలు, 14 బోట్లను సిద్ధం చేశారు.

161 గ్రామాల్లో ప్రత్యేక బృందాలను నియమించగా ఇప్పటికే ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అలర్ట్ అయ్యాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో 124 మంది గర్భిణులను గుర్తించి ఆస్పత్రులకు తరలించారు. కొన్ని ప్రాంతాలు జలమయం అవ్వడంతో ముందుగానే సీఎం కలెక్టర్లను, అధికారులను అప్రమత్తం చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్