ఆదివారం, 27 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

దౌత్య చర్చలతోనే సంఘర్షణకు పరిష్కారం : ఇరాన్‌

1 గంట క్రితం

Iran insists
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 27, 2026, 12:17 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

టెహ్రాన్‌ : దౌత్య చర్చలు మ్రాతమే అమెరికా, ఇజ్రాయిల్‌లతో సంఘర్షణను పరిష్కరించగలవని ఇరాన్‌ ఆదివారం స్పష్టంచేసింది. యుద్ధం ముగింపుకు, హార్ముజ్‌ జలసంధిని తిరిగి ప్రారంభించేందుకు ఇరాన్‌ ప్రతిపాదనను అమెరికా అధ్యక్ష‍ుడు ట్రంప్‌ తిరస్కరించిన సంగతి తెలిసిందే. తమ షరతులు స్పష్టంగా ఉన్నాయని, హార్ముజ్‌ జలసంధిని తిరిగి తెరిచే దిశగా తీసుకునే ఏచర్య అయినా ఈ షరతుల అంగీకరించడంపైనే ఆధారపడి ఉంటుందని ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ సోషల్‌ మీడియా ప్రకటనలో తెలిపారు. చర్చల ద్వారా లభించే పరిష్కారం మాత్రమే వారిని ఈ ప్రతిష్టంభన నుండి బయటపడేయగలదని అన్నారు. ట్రంప్ బహిరంగ ప్రకటనలు చేసినప్పటికీ, అమెరికాతో ఇరాన్ జరుపుతున్న చర్చలకు సహకరిస్తున్న మధ్యవర్తులు, ఆ ప్రణాళికను అమెరికా తిరస్కరించిందన్న విషయాన్ని తమకు అధికారికంగా తెలియజేయలేదని అరాగ్చీ పేర్కొన్నారు. మధ్యవర్తులు తమకు ఖచ్చితమైన అభిప్రాయాలను తెలిపే వరకు తాము వేచి చూస్తున్నామని, వాటి ఆధారంగానే తదుపరి నిర్ణయం తీసుకుంటామని అన్నారు.
న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో ఇరాన్ గత వారం ఒక శాంతి ప్రతిపాదనను ప్రకటించింది. ఖతార్ మధ్యవర్తుల ద్వారా ఈ ప్రతిపాదనను అమెరికాకు పంపింది. అయితే, ఆ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్లు శనివారం ట్రంప్ ప్రకటించారు. హార్ముజ్‌ జలసంధి విషయంలో ఒప్పందం కోసం ఇరాన్‌ ప్రయత్నించడానికి వారి నిస్సహాయతే కారణమని ఆరోపించారు.
ఇరాన్‌ తీవ్రమైన నష్టాలను ఎదుర్కొంటున్నందునే హార్ముజ్‌ జలసంధిని వెంటనే తెరిచేలా ఒప్పందం చేసుకోవాలని కోరుకుంటోంది అని అని వైట్ హౌస్‌లో మీడియాతో ట్రంప్‌ పేర్కొన్నారు.
ట్రంప్ ఇరాన్ ప్రతిపాదనను తిరస్కరించారని పేరు చెప్పేందుకు ఇష్టపడని ఒక అధికారి పేర్కొన్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ మొదటగా నివేదించింది. ఇరాన్ తన డిమాండ్లను నెరవేరుస్తుందనే విషయంలో ట్రంప్ వ్యక్తిగతంగా సందేహంతో ఉన్నారని, నవంబరులో జరిగే అమెరికా మధ్యంతర ఎన్నికల తర్వాత బాంబుల వర్షం కురిపించే అవకాశం ఉందని ఆయన తన సిబ్బందితో చెప్పినట్లు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ పేర్కొంది. మధ్యవర్తుల ద్వారా ఇరాన్‌తో చర్చలు "సానుకూలంగా, నిర్మాణాత్మకంగా" ఉన్నాయని మరో అమెరికా అధికారి అంతకుముందు వెల్లడించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్