ఏషియన్ గేమ్స్ 2026లో భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ఓటమి పాలైంది. మహిళల సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్లో చైనాకు చెందిన చెన్ యూఫెయ్ తలపడిన సింధు తొలి గేమ్‌ను గెలిచి ఆ తర్వాత వరుసగా రెండు గేమ్‌లను కోల్పోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. తుది స్కోరు 21-11, 18-21, 10-21గా నమోదైంది. మ్యాచ్ ప్రారంభంలో పీవీ సింధు అద్భుతంగా ఆడింది. తొలి గేమ్‌ను 21-11తో సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లో చెన్ యూఫెయ్ పుంజుకుని 21-18తో రెండో గేమ్‌ను గెలుచుకుంది. నిర్ణయాత్మక గేమ్‌లో చెన్ యూఫెయ్ మరింత దూకుడుగా ఆడి సింధుపై వరుస పాయింట్లు సాధిస్తూ 21-10తో మూడో గేమ్‌ను గెలిచి మ్యాచ్‌ను 2-1తో సొంతం చేసుకుంది. దీంతో పీవీ సింధు మహిళల సింగిల్స్ పోటీ నుంచి నిష్క్రమించింది.
Asian Games : పీవీ సింధు ఓటమి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 27, 2026, 12:06 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)