గురువారం, 22 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

గొడ్డు మాంసం, కులం పేరుతో వేధింపులు..!

14 నిమిషాల క్రితం

Coimbatore student
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 22, 2026, 11:45 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • కోయంబత్తూరులో 11వ తరగతి విద్యార్థి ఆత్మహత్య

కోయంబత్తూరు : కోయంబత్తూరులోని ప్రభుత్వ ఎయిడెడ్‌ ‌స్కూల్లో 11వ తరగతి చదువుతున్న షెడ్యూల్డ్‌‌ కులానికి చెందిన విద్యార్థి అకిలాన్‌ బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. అకిలాన్‌ ‌కులంపై, అతడి ఆహారపు అలవాట్లపై కొంతమంది క్లాస్‌‌మేట్‌‌లు, టీచర్‌ ‌చేసిన వేధింపులే దీనికి కారణమని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. రెండు మాసాల క్రితం గొడ్డు మాంసం తిన్నందుకు తన కుమారుడితో సహా ఐదుగురిని తరగతి గది బయట టీచర్‌ ‌విజయ్‌‌కుమార్‌ ‌నిలబెట్టారని అకిలాన్‌ ‌తల్లి తెలిపింది. ఆత్మహత్యకు ప్రేరేపించారన్న అభియోగాలపై టీచర్‌ ‌విజయ్‌‌కుమార్‌, ప్రిన్సిపల్‌ అరుణ్‌ ‌కుమార్‌, ఇద్దరు విద్యార్ధులపై పీలమేడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గురువారం టీచర్‌ ‌విజయ్‌‌కుమార్‌‌ను పోలీసులు ప్రశ్నించారు. బుధవారం ఉదయం 8గంటల సమయంలో స్కూలుకు వెళుతున్నానని అకిలాన్‌ ‌తల్లికి చెప్పి వెళ్లాడని పోలీసులు తెలిపారు. తర్వాత పనికి వెళ్లిన తల్లి మధ్యాహ్నం ఒంటిగంటకు ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంటి తలుపు వేసి వుందని లోపలకు చూడగా ఆమె కుమారుడు చనిపోయి కనిపించాడని పోలీసులు తెలిపారు. రెండు మాసాల క్రితం స్టయిఫండ్‌ ‌కోసం పేరు నమోదు చేసుకునేం దుకు తరగతి గదిలో ఎస్‌‌సి విద్యార్థుల గురించి వాకబుచేస్తూ... ఎంతమంది గొడ్డు మాంసం తిన్నారంటూ టీచర్‌ ‌ప్రశ్నించారని అఖిలాన్‌ తల్లి తెలిపింది. అప్పటి నుండి ఇద్దరు క్లాస్‌‌మేట్‌‌లు అకిలాన్‌‌ను కులం పేరుతో వేధించడం మొదలు పెట్టారని తెలిపారు. టీచర్‌‌కు, ప్రిన్సిపాల్‌‌కు అఖిలాన్‌ చెప్పినా ఎలాంటి చర్య తీసుకోలేదని చెప్పారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్