తెప్పలపై చిన్నారులు, వృద్ధుల తరలింపు
పునరావాస కేంద్రాలకు గ్రామస్తులు
ప్రజాశక్తి – యు. కొత్తపల్లి: ఉప్పాడ పంచాయతీ పరిధిలోని రంగంపేట గ్రామాన్ని సముద్రపు అలలు ముంచెత్తాయి. అలల ఉద్ధృతి పెరగడంతో సముద్రపు నీరు గ్రామంలోకి చొచ్చుకురావడంతో పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. దీంతో అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. గ్రామంలో నీరు చేరడంతో చిక్కుకున్న చిన్నారులు, వృద్ధులను స్థానికులు తెప్పల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరోవైపు సాయంత్రం నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో గ్రామమంతా అంధకారంలో చిక్కుకుంది. తీవ్ర గాలులు వీస్తుండటంతో తీర ప్రాంత మత్స్యకారులు భయాందోళనకు గురవుతున్నారు. సముద్రపు అలల ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతుండటంతో అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ముంపు ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ, పునరావాస కేంద్రాలకు చేరుస్తున్నారు. సముద్రపు నీటి చొరబాటుతో గ్రామంలో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి.








కామెంట్‌లు (0)