బుధవారం, 29 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

మోడీ ప్రభుత్వానికి రెండో గుణపాఠం

4 రోజుల క్రితం

sfi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 25, 2026, 09:14 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- పోరాడాం.. గెలిచాం

- విద్యార్థుల పోరాట ఫలితమే మంత్రి రాజీనామా

- సిఐటియు, ఎస్‌ఎఫ్‌ఐ, కౌలురైతుల సంఘం

‌ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : నీట్ పేపర్ లీక్‌పై సమరశీలంగా పోరాడి విజయం సాధించిన విద్యార్ధులు, యువతకు సిఐటియు ఎపి కమిటీ అభినందనలు తెలిపింది. యూనియన్‌ ‌రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సిహెచ్‌ నరసింగరావు, ఎవి నాగేశ్వరరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 22 మంది విద్యార్ధులను బలితీసుకుని, వారి తల్లిదండ్రులకు క్షోభను మిగిల్చిన నీట్ పేపర్ లీక్‌పై విద్యార్ధులు చేసిన పోరాట ఫలితంగానే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయక తప్పలేదని పేర్కొన్నారు. కేంద్రంలోని బిజెపి మోడీ ప్రభుత్వం చివరి దాకా తన బలప్రయోగం, పోలీసులతో ఉద్యమాన్ని అణచాలని చేసిన కుటిల ప్రయత్నాలను దేశ యువత పోరాట పటిమముందు తలవంచక తప్పలేదని పేర్కొన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి ఇది రెండోవ గుణపాఠమని తెలిపారు. ఒక గుణపాఠాన్ని దేశ ప్రజానీకానికి ఆహారాన్ని అందించే రైతాంగం నేర్పిందని పేర్కొన్నారు. బిజెపి మోడీ ప్రభుత్వం తమ పద్ధతి మార్చుకోకపోతే ఇవే గుణపాఠాలు నేర్చుకోక తప్పదని పోరాటాలు తెలియజెప్పాయని పేర్కొన్నారు. విద్యార్ధుల పోరాటాలకు మద్దతు తెలిపిన ప్రజా సంఘాలు, మేధావులు, సెలబ్రిటీలు, ప్రగతిశీలమైన రాజకీయ పార్టీలకు సిఐటియు ఎపి కమిటీ అభినందిస్తోందని తెలిపారు. భవిష్యత్తులోనూ నిజమైన దేశాభివృద్ధి కోసం అందరూ ఐక్యంగా ముందుకు సాగాలని కోరారు.

పోరాడాం... గెలిచాం!

​ధర్మేంద్ర ప్రధాన్‌ను రాజీనామా చేయించే వరకు నిరంతరంగా పోరాడిన ప్రతి విద్యార్థి, యువత, ప్రజాస్వామ్య శక్తులను భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) అభినందిస్తోందని ఆ సంఘ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి రామ్మోహన్‌, కె ప్రసన్న కుమార్‌ ‌శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇది విద్యార్థుల ఐక్యత సాధించిన చారిత్రాత్మక విజయని పేర్కొన్నారు. సంఘటిత విద్యార్థి శక్తి ముందు ఏ పాలకుడూ గొప్పవాడు కాదని ఈ పోరాటం మరోసారి నిరూపించిందని తెలిపారు. గత రెండు నెలలుగా కొనసాగిన విద్యార్థుల ఉద్యమం నరేంద్ర మోడీ ప్రభుత్వ అహంకార కోటను కదిలించిందని విమర్శించారు.ఈ పోరాటంలో విద్యార్థులకు అండగా నిలిచిన ప్రజాస్వామ్య, ప్రగతిశీల విద్యార్థి, యువజన, ప్రజా సంఘాలకు కృతజ్ఞతలు తెలిపారు. దేశవ్యాప్తంగా విద్యార్థి ఆగ్రహాన్ని శాంతియుత, శక్తివంతమైన ప్రజాస్వామ్య ఉద్యమంగా మలచడంలో కీలక పాత్ర పోషించిన సిజెపితో పాటు అన్ని ప్రగతిశీల విద్యార్థి సంఘాల నాయకత్వాన్ని అభినందిస్తూన్నామని పేర్కొన్నారు.

​విద్యార్ధుల పోరాట ఫలితమే మంత్రి రాజీనామా : ఎపి కౌలు రైతుల సంఘం

నీట్ పేపర్ లీక్‌పై సమరశీలంగా విద్యార్థుల చేసిన పోరాట ఫలితమే కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా అని కౌలు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.బలరాం, ఎం హరిబాబు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పోరాడి విజయం సాధించిన విద్యార్థులు. యువతకు అభినందనలు తెలిపారు. నిరవధిక దీక్షలో పాల్గొన్న పర్యావరణవేత్త సోనం వాంగ్ చుక్ ,ఐసా, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల నాయకులు నిరవదిక నిరాహార దీక్షల్లో పాల్గొనడం సాహసోపేత నిర్ణయమని పేర్కొన్నారు. సమస్యను సకాలంలో గుర్తించి కాక్రోచ్ జనతా పార్టీని స్థాపించి ఉద్యమాన్ని నడిపిన యువకులు, వీరికి మద్దతుగా నిలిచిన ప్రజాసంఘాలు రాజకీయ పార్టీలు ప్రముఖులందరినీ అభినందిస్తున్నామని తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్