విజయనగరం: విద్యుదాఘాతంతో గొర్రెల కాపరి బంగారయ్యతో పాటు 13 గొర్రెలు మృతి చెందిన ఘటన లేమర్తి నిర్వాసిత కాలనీలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. కాలనీలో విద్యుత్ వైరు కింద పడి ఉండటాన్ని గమనించని కాపరి దానికి తగిలి మృతి చెందాడు. గొర్రెలు కూడా మృతిచెందాయి. మృతి చెందిన బంగారయ్యది విజయనగరం జిల్లా, ఎల్.కోట మండలం కెస్సన్నపేట గ్రామంగా గుర్తించారు. విషయం తెలుసుకొని దువ్వాడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.









కామెంట్‌లు (0)