మంగళవారం, 08 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆ విద్యార్థుల ధర్నాతో 'శ్యామ్'కు సంబంధం లేదు!

1 గంట క్రితం

Short film competitions on the protection of girls
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 08, 2026, 07:50 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • మా సంస్థ ద్వారా పోలీసులను తయారు చేశాను గానీ నేరస్తులను కాదు

  • 'శ్యామ్' పై పోలీసు దాడుల పట్ల కన్నీటి ఆవేదన

ప్రజాశక్తి-కాకినాడ : పోలీసు నియామకాల భర్తీ ప్రక్రియ చేపట్టాలని కోరుతూ నిర్వహించిన ధర్నాకు శ్యామ్ సంస్థకు విద్యార్థులు ఎటువంటి సంబంధం లేదని శ్యామ్ అధినేత గుంటూరి తణుకులు (శ్యామ్) తెలిపారు. తాను తన శ్యామ్ ఇన్స్టిట్యూట్ అనే సంస్థ ద్వారా సమాజంలో ఉన్నత విలువలు కలిగిన పోలీసులను మాత్రమే తయారు చేయాలనుకుంటున్నానే గానీ నేరస్తులను తయారు చేయాలని ఉద్దేశం తనకు ఎటువంటి ఆలోచన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం తెల్లవారుజామున శ్యామ్ వసతి గృహంపై పోలీసులు దాడులు చేసి తనతో పాటు విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేయడం పట్ల ఆయన మీడియా ముందు కన్నీళ్ల పర్యంతమయ్యారు. ఇన్స్టిట్యూట్లో శ్యామ్ సంస్థ డైరెక్టర్ శ్యామ్ పోలీసుల దాడులకు సంబంధించి విలేకరులకు వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా శ్యామ్ మాట్లాడుతూ మంగళవారం కాకినాడలో పోలీసు ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ విద్యార్థులు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద భారీ ధర్నా నిర్వహించారన్నారు. దానిపై తనను పోలీసులు సోమవారం మధ్యాహ్నం పిలిచి రాత్రి వరకు విచారణ చేపట్టి పంపారని చెప్పారు మంగళవారం ఉదయం తెల్లవారుజామునే వసతి గృహంపై పోలీసులు దాడులు చేసి విద్యను అభ్యసిస్తున్న వారిని భయభ్రాంతులకు గురి చేశారన్నారు. పోలీసులు తగల రీతిలో బదిలీచానని అయినా దాడులు చేయడం తింటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై ఏదో కుట్ర కోణం ఉందని చెప్పారు. తాను ఎవరికి తోను వైరం లేదని అందరితోని సన్నిహితంగా ఉంటానని పోలీసులు ఇలా దాడులు చేసి సంస్థ ప్రతిష్టను దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను తన భార్య ఉన్నత స్థాయి ప్రభుత్వ ఉద్యోగాలను వదులుకొని 26 సంవత్సరాల నుంచి సంస్థ అభివృద్ధి కోసం విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో దీనిని ఏర్పాటు చేశామన్నారు. తాను ఎన్నో సమస్యలు ఎదుర్కొని కూలి పని చేసుకుంటూ ఈ స్థితి చేరిన వాడినని ఈ సంస్థపై నమ్మకంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పోలీసు ఉద్యోగాల కోసం శిక్షణ నిమిత్తం చేరుతున్నారన్నారు. శిక్షణ పూర్తయిన అభ్యర్థులు చాలా కష్టాలు ఎదుర్కొంటున్నారని ఒకే గదిలో ఇద్దరు ముగ్గురు ఉంటూ తిండి లేక కష్టాలు పడుతున్న తీరుని చూసి తాను ఆవేదన చెందుతున్నట్లు చెప్పారు. అందులో భాగంగా సీఎం చంద్రబాబును కలిసి పోలీసు శాఖలో ఉద్యోగాలు పెంచాలని కోరుతూ ఒక వినతిపత్రం అందించినట్లు కూడా శ్యామ్ గుర్తు చేశారు. విద్యార్థుల పైన కేసులు పెట్టినట్లు పోలీసులు చెప్పారని వారిపై ఎత్తివేయాలని తనపై పెట్టిన కేసుపై న్యాయపోరాటం చేస్తానని చెప్పారు. తన సమయాన్ని విద్యార్థులకు కేటాయించి వారిని ఉన్నత స్థితిలో చేర్చేందుకే కేటాయిస్తానని చెప్పారు. తన సంస్థపై జరిగిన దాడులకు సంబంధించి వివరాలు తెలుసుకుంటున్నానని తెలిసిన వెంటనే బహిర్గతం చేస్తానని శ్యామ్ విలేకరులకు చెప్పారు. ఇప్పటివరకు తమ ఇన్స్టిట్యూట్ ద్వారా 25 వేల మంది పోలీసులు (యూనిఫాం) ఉద్యోగాలు పొందారని శ్యామ్ చెప్పారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్