మంగళవారం, 08 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition18న ‘పిఠాపురంలో అలా మొదలైంది’

1 గంట క్రితం

pitapuramlo ala modalindi.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 08, 2026, 08:45 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

‘ప్రేయసి రావే’ ఫేమ్‌ మహేష్‌ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో.. అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్‌ 18న విడుదల కానుంది. డా. రాజేంద్రప్రసాద్‌, పృథ్వీరాజ్‌, కేదార్‌ శంకర్‌, మణిచందన, అన్నపూర్ణమ్మ, సన్నీ అఖిల్‌, విరాట్‌, సాయి ప్రణీత్‌, శ్రీలు, ప్రత్యూష, రెహానా తదితరులు నటించిన ఈ చిత్రాన్ని మహేష్‌ చంద్ర సినిమా టీమ్‌, ఎవర్‌ గ్రీన్‌ ఎపిక్‌ సినిమా సంయుక్త నిర్మాణంలో దుండిగళ్ళ బాలకృష్ణ, ఆకుల సురేష్‌ పటేల్‌, ఎఫ్‌.ఎం. మురళి (గోదారి కిట్టయ్య) నిర్మించారు. ప్రేమ, హాస్యం, సెంటిమెంట్‌, తండ్రీకూతుళ్ల అనుబంధం వంటి అంశాలతో త్రాన్ని రూపొందించినట్లు దర్శకుడు తెలిపారు. బ్రహ్మానందం వాయిస్‌ ఓవర్‌ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్