గురువారం, 03 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionగనుల రంగంలో గణనీయమైన వృద్ధి

1 గంట క్రితం

KOLLU RAVINDRA.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 03, 2026, 08:54 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • మంత్రి కొల్లు రవీంద్ర

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : గనుల రంగంలో రాష్ట్రం గణనీయమైన వృద్ధిని సాధిస్తుందని ఆ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మంగళగిరిలోని మయూరి టెక్ పార్కులో ఏర్పాటు చేసిన డైరెక్టరేట్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ కార్యాలయాన్ని ఆయన గురువారం ప్రారంభించారు. కార్యాలయంలో ఏర్పాటు చేసిన కెమికల్ ల్యాబ్, కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్, రికార్డు రూమ్, మైన్స్ ఎగ్జిబిషన్‌ను పరిశీలించాను. అనంతరం అన్ని జిల్లాల నుండి వచ్చిన మైనింగ్ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత ఆర్థిక సంవత్సరంలో గనుల శాఖ ఖనిజ ఆదాయం రూపంలో రూ.3,416 కోట్లు వసూలు చేసిందని, అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 32 శాతం వృద్ధి నమోదైందని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు రూ.1,287.33 కోట్ల ఆదాయం సమకూరిందన్నారు. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 12.9 శాతం వృద్ధి నమోదైందన్నారు. గత ఏడాదిలో 21 ప్రధాన ఖనిజ గనులను వేలం వేశామని, 2015లో ఇ-వేలం విధానం ప్రారంభమైనప్పటి నుంచి ఇంత పెద్ద సంఖ్యలో గనుల వేలం జరగలేదని తెలిపారు. ఈ పనితీరుతో ఆంధ్రప్రదేశ్ దేశంలోని అత్యధిక సంఖ్యలో ప్రధాన ఖనిజ గనులను వేలం వేసిన మొదటి నాలుగు రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచిందని పేర్కొన్నారు. ఖనిజాల వేలానికి సుమారు 1,900 కొత్త దరఖాస్తులు అందాయని, రూ.172 కోట్ల ప్రీమియం వసూలైందని తెలిపారు. గత రెండేళ్లలో సుమారు 450 లీజులు మంజూరయ్యాయని చెప్పారు. 2024 జూలై నుంచి ఉచిత ఇసుక విధానం కింద పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా సుమారు 2.1 కోట్ల మెట్రిక్ టన్నుల ఇసుకను సరఫరా చేసినట్లు వెల్లడించారు. నిర్వహణ ఖర్చులు మాత్రమే వసూలుచేస్తూ ఉచితంగా అందించడం కూటమి ప్రభుత్వ ఘనత అని అన్నారు. ఇసుక లభ్యతపై ప్రజల సంతృప్తి 55 శాతం నుంచి 75 శాతానికి పైగా పెరిగిందన్నారు. జొన్నగిరి, చిగురుగుంట-బిన్నితం, బొక్సంపల్లె, రామగిరి ప్రాంతాల్లోని బంగారు గనుల పనులు ముందుకు సాగుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో మైన్స్ డైరెక్టర్ చంద్రశేఖర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్