గురువారం, 03 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionప్లాస్టిక్‌ బకెట్‌‌లో డిటోనేటర్లు

1 గంట క్రితం

army.webp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 03, 2026, 10:09 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ఆర్మీ ఫైరింగ్‌ రేంజ్‌ సమీపంలో లభ్యమవడంతో కలకలం

ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో : గత సోమవారం బొల్లారంలోని మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆయుధాల గది తాళం పగులగొట్టిన అగంతకులు నాలుగు ఎకె 47లు, ఆరు పిస్టళ్లు, ఒక ఇన్సాస్‌ రైఫిల్, మందుగుండు సామగ్రి ఎత్తుకెళ్లినట్లు అధికారులు గుర్తించిన ఘటన మరువకముందే అదేప్రాంతంలో డిటోనేటర్లు బయటపడటం కలకలం రేపింది. ఫైరింగ్‌ రేంజ్‌ వెనుక గోడ సమీపంలో ప్లాస్టిక్‌ బకెట్‌లో 8 బండిల్స్‌లో 33ఏ సైజ్‌ ఉన్న 160 ఎలక్ట్రికల్‌ డిటోనేటర్లను గుర్తించారు. ఆర్మీ సిబ్బంది సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. డిటోనేటర్లను అక్కడ వదిలి వెళ్లింది ఎవరనే దానిపై ఆరా తీస్తున్నారు. మల్కాజిగిరి బాంబ్‌ డిస్పోజల్‌ టీమ్‌ సూచనతో అధికారులు వాటిని భద్రపరిచారు. గుర్తుతెలియని వ్యక్తులపై ఎక్స్‌ప్లోజివ్‌ సబ్‌స్టెన్సెస్‌ యాక్ట్‌ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్