ప్రజాశక్తి - సూళ్లూరుపేట రూరల్ : శ్రీహరికోట భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి జిఎస్‌ఎల్‌వి–ఎఫ్17 రాకెట్ ద్వారా ఇఒఎస్ - 05 ఉపగ్రహాన్ని నింగిలోకి పంపేందుకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. ఈ ప్రయోగానికి సంబంధించిన 27.5 గంటల కౌంట్‌డౌన్ ప్రక్రియ బుధవారం రాత్రి 11:25 గంటలకే ప్రారంభమై, ప్రస్తుతం సజావుగా సాగుతోంది. శుక్రవారం తెల్లవారుజామున 2.55 గంటలకు రాకెట్‌ను ప్రయోగించనున్నారు. వాతావరణ పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాలు, వ్యవసాయం తదితర రంగాలకు అవసరమైన సమాచారాన్ని అందించడంలో ఈ ఉపగ్రహం సహాయపడనుంది. ప్రయోగానికి ముందు చివరి దశలో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా శాస్ర్తవేత్తలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే నిర్ణీత సమయానికి రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది.
Print Editionజిఎస్ఎల్వి -ఎఫ్ 17 కౌంట్‌డౌన్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 03, 2026, 10:11 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)