గురువారం, 03 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionతెలంగాణ మంత్రి కొండా సురేఖ‌పై వేటు

1 గంట క్రితం

Kodasureka @.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 03, 2026, 10:04 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • పదవి నుంచి బర్తరఫ్‌కు గవర్నర్‌ ఆమోదం

ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో : క్రమశిక్షణా చర్యల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణం, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్‌ అధిష్టానం వేటు వేసింది. మంత్రివర్గం నుంచి తొలగించేందుకు అధిష్ఠానం గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో గవర్నర్‌ శివ్‌ప్రతాప్‌ శుక్లాకు గురువారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లేఖ పంపారు. మంత్రివర్గం నుంచి కొండా సురేఖను బర్తరఫ్‌ చేయాలని లేఖలో కోరారు. దీంతో గవర్నర్‌ శివ్‌‌ప్రతాప్‌ ‌శుక్లా ఆమోదం తెలిపారు. ఆమెతో పాటు కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డిని కూడా తొలగించారు. చిన్నారెడ్డి స్థానంలో జిహెచ్‌ఎంసి మాజీ మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మిని నియమించారు. రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారద, కాకతీయ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ చైర్‌పర్సన్‌గా జి.సుధారాణి నియమిస్తూ సిఎస్‌ ఉత్తర్వులు జారీచేశారు.

​హైకమాండ్‌‌ను సిఎం బ్లాక్‌‌మెయిల్‌ ‌చేశారు - కొండా సురేఖ

మంత్రి పదవి నుంచి తనను తొలగించే ఉద్దేశం కాంగ్రెస్‌ హైకమాండ్‌కు లేకపోయినా... హైకమాండ్‌ను సిఎం రేవంత్‌‌రెడ్డి బ్లాక్‌మెయిల్‌ చేశారని కొండా సురేఖ ఆరోపించారు. హైదరాబాద్‌‌లో మీడియాతో ఆమె మాట్లాడుతూ...తనకు ప్రజల మద్దతు ఉందనీ, నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యేగా కొనసాగుతానని తెలిపారు. ఈ పరిణామాలను అవమానంగా భావించటం లేదన్నారు. ఏ తప్పు చేయలేదనీ, కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్