శుక్రవారం, 31 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionనేడు ఎస్‌ఐఆర్‌ ముసాయిదా

1 గంట క్రితం

SIR Exercise Concluded – 44.71 Lakh Votes Deleted in AP..!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 31, 2026, 04:45 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కేంద్ర ఎన్నికల సంఘం ​రాష్ట్రంలో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)లో భాగంగా ఈ నెల 31న శుక్రవారం ముసాయిదా జాబితా విడుదల కానుంది. సుమారు నెలా పది రోజుల పాటు నిర్వహించిన ఇంటింటి సర్వేలో మొత్తం 4,16,27,694 మంది ఓటర్లలో 3,71,38,206 మంది (89.22 శాతం) వివరాలను సమర్పించారు. పరిశీలన అనంతరం 44,89,528 మంది ఓటర్లను 'అన్‌కలెక్టబుల్' జాబితాలో చేర్చారు. ఇందులో 15,22,174 మంది మృతులు, 14,43,886 మంది వలస వెళ్లినవారు, 7,77,885 మంది చిరునామాల్లో లభించనివారు, 7,37,216 మంది డబుల్ ఎంట్రీలు, మరో 8,327 మంది ‘ఇతర కారణాలు’ కింద పేర్కొన్నారు. ఫారాల్లో తప్పులు, అసంపూర్ణ వివరాలు, ఆధార పత్రాల లోపాల కారణంగా వీరి వివరాలు మ్యాపింగ్ కాలేదు. ముసాయిదా జాబితా విడుదలైన తర్వాత వీరికి నోటీసులు జారీ చేయనున్నారు. ఆగస్టు30 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 28 వరకు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి అర్హులైన వారి పేర్లను అక్టోబరు 3న విడుదలయ్యే తుది ఓటర్ల జాబితాలో చేర్చనున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్