ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : దివ్యాంగుల కోసం సదరం రెండో త్రైమాసిక స్లాట్ బుకింగ్‌ను జూలై 8 నుంచి ప్రారంభిస్తున్నట్లు సెకండరీ హెల్త్ డైరెక్టర్ కెవిఎన్ చక్రధర్ బాబు తెలిపారు. కొత్త విధానంలో రాష్ట్రాన్ని ఆరు జోన్లుగా విభజించి, దరఖాస్తుదారులు తమ జిల్లా లేదా అదే జోన్‌లోని సమీప జిల్లాల్లోనే వైకల్య నిర్ధారణ పరీక్షలకు స్లాట్ బుక్ చేసుకునే అవకాశం కల్పించినట్లు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కాన్నారు. దివ్యాంగుల డేటా భద్రత కోసం బ్లాక్‌చెయిన్ టెక్నాలజీని వినియోగిస్తున్నామని, డేటాలో అనధికార మార్పులు చేయడం సాధ్యం కాదని వెల్లడించారు. తొలి వైకల్య నిర్ధారణ పరీక్ష ఫలితంపై అసంతృప్తి ఉంటే మరో రెండు అప్పీళ్లకు మాత్రమే అవకాశం ఉంటుందని తెలిపారు. స్లాట్ బుకింగ్, వైకల్య నిర్ధారణ పరీక్ష, సర్టిఫికెట్ డౌన్‌లోడ్ పూర్తిగా ఉచితమని, ఎలాంటి దళారులను నమ్మి డబ్బులు చెల్లించవద్దని హెచ్చరించారు. ఆధార్, మొబైల్ నంబర్, ఈమెయిల్‌తో ఏపీ సేవ పోర్టల్‌లో లేదా గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా స్లాట్ బుక్ చేసుకోవచ్చని తెలిపారు. త్వరలో 104 హెల్ప్‌డెస్క్ ద్వారా సాంకేతిక సమస్యలపై సహాయం అందించనున్నట్లు చెప్పారు. జూలై 13 నుంచి కొత్త విధానంలో వైకల్య నిర్ధారణ పరీక్షలు ప్రారంభమవుతాయని, సెప్టెంబర్ వరకు సుమారు 70 వేల మంది దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు.
నేటి నుంచి సదరం స్లాట్ బుకింగ్
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 08, 2026, 06:45 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)