ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : శ్రీ సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తిలో ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న విమాన పరీక్షల సముదాయం (ఎఫ్‌టిసి) ప్రాజెక్టు అమలును పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు పరిశ్రమలు, వాణిజ్య శాఖ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. విమాన పరీక్షలకు అవసరమైన పుట్టపర్తి విమానాశ్రయ మౌలిక వసతుల అభివృద్ధి, వివిధ శాఖలు, కేంద్ర ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం, ప్రాజెక్టు పనులను వేగవంతం చేయడం కమిటీ ప్రధాన బాధ్యతలుగా ఉంటాయి. కమిటీలో మౌలిక వసతులు–పెట్టుబడులు, రహదారులు–భవనాలు, రెవెన్యూ, పరిశ్రమలు–వాణిజ్య శాఖల ఉన్నతాధికారులతో పాటు కేంద్ర రక్షణ ఉత్పత్తి శాఖ, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, రక్షణ పరిశోధన–అభివృద్ధి సంస్థ, డీఆర్‌డీవో, ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ, భారత వైమానిక దళం ప్రతినిధులకు చోటు కల్పించారు. శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్, ఏపీ విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ, ఏపీఐఐసీ, శ్రీ సత్యసాయి ట్రస్ట్ ప్రతినిధులు కూడా కమిటీలో సభ్యులుగా ఉంటారు. పరిశ్రమల శాఖ డైరెక్టర్ కమిటీ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ప్రాజెక్టు అమలులో అవసరమైన ఇతర అధికారులను కూడా సమీక్షా సమావేశాలకు భాగస్వామ్యం చేసి, అన్ని విభాగాల మధ్య సమన్వయంతో పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఎఫ్‌టిసి ప్రాజెక్టు పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీ
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 09, 2026, 11:32 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)