బుధవారం, 26 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఖరీఫ్‌ సాగుకు ప్రత్యేక ప్రణాళిక : మంత్రి అచ్చెన్నాయుడు

1 గంట క్రితం

Minister-Atchannaidu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 26, 2026, 11:59 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఖరీఫ్‌ సాగుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టిందని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంటే మాజీ సిఎం వైఎస్‌ జగన్‌ విమర్శలు చేయడం సరికాదని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జూన్‌ మొదటి వారం నుంచి ఆగస్టు 25 వరకు రాష్ట్రంలో 192.8 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైందని, సాధారణ వర్షపాతం 393.7 మిల్లీమీటర్లతో పోలిస్తే 51 శాతం లోటు ఉందని అన్నారు. అయినప్పటికీ ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికతో పప్పుధాన్యాల సాగు గతేడాదితో పోలిస్తే 23.6 శాతం పెరిగిందన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్