మంత్రి గొట్టిపాటి రవికుమార్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: శ్రీశైలం ప్రాజెక్టుకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కడం తెలుగు రాష్ట్రాల ప్రజలకు గర్వకారణమని ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. డ్యామ్ నిర్మాణ పటిష్టత, జలవిద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం, సాగు, తాగునీటి అవసరాలకు అందిస్తున్న సేవలకు అంతర్జాతీయ గుర్తింపు లభించడంపై మంగళవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. శ్రీశైలం జలాశయం దశాబ్దాలుగా భారీ వరదలను తట్టుకుంటూ ప్రజలకు సేవలందిస్తోందని తెలిపారు. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు ఇప్పటి వరకు సుమారు 500 టిఎంసిల నీటిని అందించడం వల్ల శ్రీశైలం జలాలను రాయలసీమ సాగు, తాగునీటి అవసరాలకు వినియోగించుకునేందుకు వెసులుబాటు కలిగిందన్నారు.








కామెంట్‌లు (0)