బుధవారం, 12 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionక్యూబా సోషలిజానికి అండగా నిలవండి

1 గంట క్రితం

citu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 13, 2026, 12:01 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • కార్మికులకు సిఐటియు పిలుపు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : క్యూబా సోషలిజానికి ప్రపంచ కార్మిక వర్గం అండగా నిలవాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు సిహెచ్ నరసింగరావు, ఆర్ కెఎస్ వి కుమార్ పిలుపునిచ్చారు. క్యూబా ప్రజలు దశాబ్దాలుగా అమెరికా ఆంక్షలను ఎదుర్కొంటూ సోషలిజాన్ని కాపాడుకుంటున్నారని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫైడల్ కాస్ట్రో ఆధ్వర్యంలో 1958 లో క్యూబా సోషలిజాన్ని సాధించిందని తెలిపారు. రాజరిక ప్రభుత్వాన్ని అధికారం నుంచి దించి కార్మిక వర్గరాజ్యాన్ని స్థాపించారని పేర్కొన్నారు.భారతదేశం,క్యూబా కలిసి అలీన ఉద్యమాన్ని నిర్మించడంలో కీలక పాత్ర వహించాయని తెలిపారు. ఫైడల్ క్యాస్ట్రో, చెగువేరా సంయుక్తంగా సోషలిస్టు సమాజాన్ని నిర్మించారని పేర్కొన్నారని, నేటికి ఒక్క పెట్టుబడిదారుడు లేరని తెలిపారు. ప్రపంచంలో అత్యంత ఉన్నతమైన ఉచిత వైద్యాన్ని ప్రజలకు అందిస్తోందని పేర్కొన్నారు. పని హక్కు అమలౌతున్న దేశం క్యూబా అని పేర్కొన్నారు. నిజమైన శ్రామిక రాజ్యం అంటే క్యూబా నిరూపించిందని తెలిపారు. అమెరికా ప్రక్కనే ఉన్న క్యూబాలో సోషలిజాన్ని అంతం చేయాలని, కాస్ట్రోని 634 సార్లు హత్య చేయాలని అమెరికా కుట్ర చేసి విఫలమైందని తెలిపారు.1958 నుంచి క్యూబా ప్రజలను అమెరికన్ స్రామాజ్యావాదం అత్యంత క్రూరమైన కష్టాలకు గురిచేస్తోందని విమర్శించారు. దిగుమతుల పై తీవ్రమైన ఆంక్షలు విధించిందని తెలిపారు. క్యూబాలోని పసి బిడ్డలకు కూడా పాలపొడి దిగుమతి చేయనివ్వడం లేదని తెలిపారు. బిపి, షుగర్ సహా అనేక ప్రాణావసర మందులను అనుమతించడం లేదని పేర్కొన్నారు. విద్యుత్ జెనరేటర్లను కొననివ్వకుండా చేస్తోందని తెలిపారు. విద్యుత్ లేక దేశమంతా అంధకారమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. క్యుబాకు ప్రపంచంలో ఇతర దేశాల నుంచి ఎగుమతులు, దిగుమతులు జరగకుండా క్యూబాను అమెరికా దిగ్భందం చేస్తోదంని విమర్శించారు. ఆహార పదార్ధాలు అందకుండా చేయడంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోంటున్నారని తెలిపారు. క్యూబా ప్రజలకు సంఘీభావం తెలియజేయడం కార్మిక వర్గ భాద్యతని తెలిపారు. ప్రపంచ కార్మిక వర్గమంతా క్యూబాకు అండగా ఉండాల్సిన సమయం అసన్నమైందని తెలిపారు. కాస్ట్రో శత జయంతి సందర్భంగా సిఐటియు రాష్ట్ర కమిటీ క్యూబా ప్రజలకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తోందని పేర్కొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్