ప్రజాశక్తి- చింతూరు (పోలవరం జిల్లా) : రంపచోడవరం ఒఎస్‌డి పంకజ్ కుమార్ మీనా ఎదుట ముగ్గురు మావోయిస్టులు బుధవారం లొంగిపోయారు. ఈ సందర్భంగా చింతూరులోని తన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పంకజ్ కుమార్ మీనా మాట్లాడుతూ... మావోయిస్టు పార్టీ ప్లాటూన్ కమిటీ సభ్యులు ముచ్చికి మంగి, పార్టీ సభ్యులు కణితి లక్ష్మయ్య, కణితి ఎంక లొంగిపోయినట్టు వెల్లడించారు. మావోయిస్టులకు పట్టు తగ్గటం, పోలీసుల గస్తీ, క్యాంప్స్ పెరగటం వల్ల స్వేచ్ఛగా తిరగలేక వారు లొంగిపోయినట్టు తెలిపారు. వారికి సరెండర్, రిహాబిటేషన్ పాలసీ ప్రకారం సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఇంకా ఎవరైనా అడవుల్లో, దళాల్లో తిరుగుతుంటే లొంగిపోవాలని కోరారు. లొంగిపోయిన వారిలో ఉన్న మంగి మావోయిస్టు పార్టీ అగ్రనేత హిడ్మాకు అంగరక్షకురాలిగా 2023 వరకూ పనిచేసి, ఆరోగ్యం సహకరించక కుంట ఎల్‌ఒఎస్‌లో చేరినట్లు తెలిపారు. ఈ సమావేశంలో సిఆర్‌పిఎఫ్ బెటాలియన్ అధికారి దీప, చింతూరు సిఐ సిహెచ్.గోపాలకృష్ణ, ఎస్ఐ సంతోష్ కుమార్ పాల్గొన్నారు.
Print Editionముగ్గురు మావోయిస్టుల లొంగుబాటు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 27, 2026, 12:01 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)