మంగళవారం, 18 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionసంక్షేమ వసతి గృహాలలో మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు ‘స్వాంతన’

3 గంటల క్రితం

dola
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 18, 2026, 10:22 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • మంత్రి డోలా శ్రీ బాల వీరాంజేయస్వామి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : దురదృష్టవశాత్తు అనారోగ్య కారణాలతో మృతి చెందిన పేద విద్యార్థుల కుటుంబాలకు స్వాంతన పథకంతో ప్రభుత్వం బాసటగా నిలిస్తోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి పేర్కొన్నారు. అంబేద్కర్ గురుకులాలు, సంక్షేమ వసతి గృహాల్లో అనారోగ్య సమస్యలతో దురదృష్టవశాత్తు మృతి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులకు రాష్ట్ర సచివాలయంలో మంత్రి చెక్కులు పంపిణీ చేశారు. ఒక్కో విద్యార్థికి రూ. 3 లక్షల చొప్పున 7 మంది విద్యార్థుల కుటుంబాలకు రూ. 21 లక్షల విలువైన చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సిఎం సూచనలతో రూ.5 కోట్లతో కార్పస్ నిధితో స్వాంతన పథకం తీసుకొచ్చామన్నారు. అంబేద్కర్ గురుకులాలు, సంక్షేమ వసతి గృహాల్లో అనారోగ్యానికి గురైన విద్యార్థులను వెంటనే గుర్తించి సకాలంలో కార్పోరేట్ వైద్యం అందిస్తున్నామని తెలిపారు. దురదృష్టవశాత్తు మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు బాసటగా స్వాంతన పథకంతో రూ. 3 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నామని వెల్లడించారు. ఇప్పటివరకు 11 మంది విద్యార్థుల కుటుంబాలకు బాసటగా రూ.33 లక్షల విలువైన స్వాంతన చెక్కులు పంపిణీ చేశామన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు బంగారు భవిష్యత్తును అందించేందుకు తమ ప్రేమానురాగాలకు దూరంగా హాస్టళ్లలో ఉంచి చదివిస్తున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యనుందించడంతోపాటు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. అంబేద్కర్ గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల ఆరోగ్యం, భద్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. కూటమి ప్రభుత్వం వచ్చాక గురుకులాలను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని మంత్రి తెలిపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్