మంగళవారం, 13 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionమహిళా కమిషన్ సభ్యులుగా శ్వేతా బ్రహ్మం

1 గంట క్రితం

మహిళా కమిషన్ సభ్యులుగా స్వేతా బ్రహ్మం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 13, 2026, 10:11 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యులుగా శ్వేతా బ్రహ్మం కోటను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు నాదెండ్ల బ్రహ్మం చౌదరితో ఆమె వివాహం జరిగిన విషయం తెలిసిందే. తాజాగా ఆమెను మహిళా కమిషన్ సభ్యులుగా నియమించడం గమనార్హం. బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి రెండేళ్ల పాటు ఆమె పదవిలో ఉంటారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కొద్ది రోజుల్లోనే బాధ్యతలు స్వీకరిస్తానని ఆమె మీడియాకు వెల్లడించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్