బుధవారం, 15 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

రాష్ట్రంలో సిండికేట్ రాజ్యం

1 గంట క్రితం

వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 16, 2026, 12:00 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • అప్సడా చట్టాన్ని *నిర్వీర్యం చేస్తే సహించం

  • ఆక్వా రైతు సమస్యలపై *త్వరలో ఉద్యమ బాట

  • భీమవరం సభలో వైసిపి అధినేత జగన్‌‌మోహన్‌‌రెడ్డి

​ప్రజాశక్తి - భీమవరం (పశ్చిమగోదావరి) : రాష్ట్రంలో టిడిపి కూటమి సిండికేట్ పాలన రాజ్యమేలుతోందని వైసిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌‌మోహన్‌ రెడ్డి విమర్శించారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో ఆక్వా రంగం పూర్తిగా సంక్షోభంలోకి వెళ్లిపోయిందన్నారు. రాబోయే రోజుల్లో ఆక్వా రైతులకు తోడుగా నడుస్తానని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు సిండికేట్ రాజ్యాన్ని కూకటివేళ్లతో పెకిలిస్తానని హెచ్చరించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఆక్వా రైతులతో బుధవారం మాజీ సిఎం జగన్‌ ‌ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వాకల్చర్ డెవలప్‌మెంట్ అథారిటీ (అప్సడా) చట్టాన్ని నిర్వీర్యం చేసి ఆక్వా రైతులను దోచుకుంటున్నా రని, రాబోయే రోజుల్లో రైతుల సమస్యలపై వైసిపి ఉద్యమ బాట పడుతుందని స్పష్టం చేశారు. ఆక్వా రైతులు దీనావస్థలో ఉన్నారని, ఫీడ్, సీడ్‌, ఎక్స్ పోర్టు, ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్లు అన్ని చంద్రబాబు సానుభూతిపరుల చేతుల్లో ఉన్నాయని, వారే ధరలు నిర్ణయిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే సిండికేట్లకు పండగే పండగని, రైతన్నలకు మాత్రం కన్నీరే మిగులుతోం దన్నారు. నాలుగు నెలల కాలంలో ఫీడ్ ధరలు రూ. 16 పెంచారని, ఫీడ్ కంపెనీలతో చంద్ర బాబు మాట్లాడితే కేవలం రూ.రెండు మాత్రమే తగ్గించారని, వంద కొరడా దెబ్బలు కాదు 99 కొరడా దెబ్బలే కదా అన్నట్లుగా చంద్రబాబు వ్యవహ రిస్తున్నారని విమర్శించారు. ధరల నియంత్రణకు హేతుబద్ధత ఉండాలని డిమాండ్‌ ‌చేశారు. తమ ప్రభుత్వ హయాంలో మూడు సార్లు ఫీడ్, సీడ్ కంపెనీలు ధరలు పెంచితే తగ్గించామని, రొయ్యలు, చేపలకు గిట్టుబాటు ధరలు కల్పించామని అన్నారు. ఆక్వా రైతులకు యూనిట్ కు రూ.1.50లకే విద్యుత్ అందించామని పేర్కొన్నారు. 35 ఆక్వా ప్రాంతాల్లో ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ లు ఏర్పాటు చేశామని, 785 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి డిగ్రీ పట్టా పొందిన పట్టభద్రులను ఫిషరీస్ అసిస్టెంట్లగా నియమించామని తెలిపారు. ఆక్వా రైతుల కష్టాలు తనకు తెలుసునని... తానున్నానని రైతుల కోసం ఉద్యమబాట పడతామని హామీ ఇచ్చారు. నరసాపురంలో ఫిషరీస్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి క్లాసులు ప్రారంభిస్తే నిలుపుదల చేశారని, మెడికల్ కళాశాల పనులు కూడా నిలిపివేశారని విమర్శించారు. మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని, కారుమూరి నాగేశ్వరరావు, గుడివాడ అమర్నాథ్ తదితరులు పాల్గొన్నారు.

​రైతుల వేదికగా రాజకీయ సభ

ఆక్వా రైతుల పోరాటానికి మద్దతుగా ‘ఆక్వా రైతులకు అండగా’ అనే నినాదంతో వైసిపి ఏర్పాటు చేసిన ఆక్వా రైతులతో ముఖాముఖి రాజకీయ సభగా మారిపోయింది. ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రస్తావించారే తప్ప వారి సమస్యలను అడిగి తెలుసుకోలేదు.

​వేదికపై కింద పడబోయిన జగన్

సభ ప్రాంగణం వేదికపైకి జగన్ వస్తున్న సమయంలో తోపులాట జరిగింది. వైసిపి నేతలంతా ఒకేసారి వేదిక పైకి రావడంతో జగన్ కింద పడబోతుండగా భద్రత సిబ్బంది వెంటనే ఆయనను పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది. ఈ నేపథ్యంలోనే ఉండి, పాలకొల్లు నియోజకవర్గాల ఇన్‌‌ఛార్జులు పివిఎల్ నరసింహరాజ, గుడాల గోపి, మాజీ డిసిఎంఎస్ చైర్మన్ యడ్ల తాతాజీ మరి కొంతమంది నేతలు వేదికపై పడిపోయారు. వేదిక ముందు భాగంలో కూడా తోపులాట జరిగింది. ఓ వైసిపి కార్యకర్తకు కాలు విరిగింది. నలుగురు మహిళా కార్యకర్తలు సొమ్మసిల్లి పడిపోయారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్