బుధవారం, 21 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వైసీపీని అభ్యర్థులను టార్గెట్ చేశారు: ఎంపీ అవినాష్ రెడ్డి

1 గంట క్రితం

avinash.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 21, 2026, 09:42 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ఇంత వరస్ట్ పోలీసింగ్ ఈ దేశంలో ఎక్కడా లేదు

ప్రజాశక్తి పులివెందుల టౌన్ : వైసీపీ అభ్యర్థులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారని కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి ఆరోపించారు. తమ ఆస్తులు ధ్వంసం చేస్తుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు. దేశంలో ఇంత అధ్వానమైన పోలీసింగ్‌ ఎక్కడా లేదన్నారు. పోలీసులు ఒక్కరోజైనా నిజాయితీగా విధులు నిర్వహించాలని అన్నారు. దాడులకు గురైన వైసీపీ అభ్యర్థుల ఇళ్లను ఎంపీ అవినాష్‌రెడ్డి బుధవారం పరిశీలించారు. గత వారం రోజులుగా వైసీపీ నాయకుల ఆస్తులపై దాడులు జరుగుతున్నాయని తెలిపారు. సీసీటీవీ ఫుటేజీలో ఆధారాలు ఉన్నా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. పోలీసుల సమక్షంలోనే దాడులు జరుగుతున్నాయని విమర్శించారు. అధికార పార్టీ నాయకులకు పోలీసులు ఊడిగం చేస్తున్నారని అన్నారు.

నామినేషన్లు వేయడానికి వెళ్లిన అభ్యర్థులను పోలీసులు అడ్డుకున్నారని తెలిపారు. ఈ ఘటనలకు సంబంధించి 900 మందిపై కేసులు నమోదు చేశారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా పోలీసులు వ్యవహరిస్తున్నారని అవినాష్‌రెడ్డి విమర్శించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్