సోమవారం, 07 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం

4 గంటల క్రితం

Speaker Gaddam Prasad.webp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 07, 2026, 11:17 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రశ్నోత్తరాలతో సభను ప్రారంభించారు. అంతలోనే బీజేపీ సభ్యులు ఆందోళన ప్రారంభించారు. 22ఏ పై వాయిదా తీర్మానానికి పట్టుబట్టారు. దీంతో మంత్రి శ్రీధర్ బాబు కలగజేసుకుని ప్రభుత్వం దీనిపై కచ్చితంగా చర్చించేందుకు సిద్ధంగా ఉందన్నారు. దయచేసి సభకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ బీజేపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. బీఏసీలో నిర్ణయించాక చర్చిస్తామని స్పీకర్ చెప్పినా.. వినకుండా పోడియం వద్ద బైఠాయించారు. 

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్