ప్రజాశక్తి-తిరుమల: ఏపీ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి ఎలాంటి సిఫారసు లేఖలు అనుమతించబోమని టిటిడి స్పష్టం చేసింది. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. స్వయంగా వచ్చే ప్రొటోకాల్ ప్రముఖులకు మాత్రమే దర్శనం, వసతి కల్పించనున్నట్లు తెలిపింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నంత వరకు ఇది వర్తిస్తుందని, యాత్రికులు విషయాన్ని గుర్తించి సహకరించాలని టిటిడి విజ్ఞప్తి చేసింది.
శ్రీవారి దర్శనానికి సిఫారసు లేఖలకు తాత్కాలిక బ్రేక్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 20, 2026, 06:10 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు




కామెంట్‌లు (0)