మంగళవారం, 20 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సిపిఎం అభ్యర్థిని చలానా కట్టకుండా ఇబ్బంది పెట్టడం దారుణం

50 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 20, 2026, 06:35 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • కలెక్టర్ కి ఫిర్యాదు చేసిన సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు

ప్రజాశక్తి-పలమనేరు : పలమనేర్ మున్సిపాలిటీలో 27 వార్డుకు నామినేషన్ వేయడానికి వెళ్లిన సిపిఎం అభ్యర్థి ఆర్ జయంతి డిపాజిట్ కట్టించుకోకుండా సమయం ఉన్నప్పటికీ తిరిగి పంపించడం దారుణమని వారిపై చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు, సిపిఎం జిల్లా నాయకులు గిరిధర్ గుప్తాలు మంగళవారం కలెక్టర్ కి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టాక్స్, పోలీసు క్లియరెన్స్ సర్టిఫికెట్లు కోసం సర్వర్లు పనిచేయక ఇబ్బంది పడ్డారని తెలిపారు. స్ర్కుట్నీ ని సమయానికి జత చేయొచ్చు అని నిబంధన ఉన్న నామినేషన్ పత్రాన్ని తీసుకోకుండా ఆలస్యం చేయడంతో చలానా తీసుకునేవారు ముందుగానే వెళ్లిపోవడంతో నామినేషన్ వేయలేకపోయారని తెలిపారు. ప్రశ్నించే వాళ్ళు నామినేషన్ వేయకూడదనే ఉద్దేశంతో అధికార పార్టీ వ్యవహరించడం సరైంది కాదన్నారు.

జిల్లా నాయకులు గిరిధర్ గుప్తా మాట్లాడుతూ ఇంటి పన్ను అభ్యర్థి పేరుతో బకాయి లేకపోయినప్పటికీ ఉందని అధికారులు చెప్పడం దారుణం. అధికారులు ఒకరు మీరు ఒకరు చెప్పుకుంటూ సమయం మించి పోయేలా చేశారని తెలిపారు. అధికారులు తప్పిదం వలన సిపిఎం అభ్యర్థి నామినేషన్ వేయలేకపోయారని దీనిపై విచారణ జరిపి నామినేషన్ కి అవకాశం ఇవ్వాలని కోరారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్