ఆదివారం, 12 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

కౌలు రైతులను ఉచిత పంటల బీమాలో చేర్చాలి

1 రోజు క్రితం

rythu sangham
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 11, 2026, 10:53 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఎపి కౌలు రైతుల సంఘం డిమాండ్

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కౌలు రైతులను ఉచిత పంటల బీమాలో చేర్చాలని ఎపి కౌలురైతుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శిలు బి.బలరాం, ఎం.హరిబాబు ప్రభుత్వాన్ని శనివారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. గత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ పసల్ బీమా యోజన లో చేరకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉచిత పంటల భీమాను అమలు చేసిందని తెలిపారు. ఇరవై నాలుగు లక్షల మంది రైతులు పంటల బీమా పథకంలో చేరారని పేర్కొన్నారు.ఈ పథకం ద్వారా కేంద్రం నుంచి రావల్సిన బీమా ప్రీమియం రాలేదని, కూటమి ప్రభుత్వం రాగానే పంటల బీమాను అమలు చేసి రైతులను పంట నష్టాల నుంచి కాపాడతామని హామీ ఇచ్చిందని తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత పంటల బీమాని రద్దుచేసి కేంద్ర ప్రభుత్వ ఫసల్ బీమా యోజనలో బాగస్వామ్యమయ్యాని విమర్శించారు. రైతులు ప్రీమియం చెల్లించి స్వచ్ఛంధంగా ఫసల్ బీమాలో చేరొచ్చని రైతులకు చెప్పడం ద్వారా రైతుల సంఖ్య 4.52 లక్షల మందికి తగ్గగా, వాతావరణ బీమాలో 8 లక్షల నుంచి15 వేలకు తగ్గిపోయారని తెలిపారు. రైతులు ఈ రెండు సంవత్సరాల్లో ప్రీమియం రూ.1770 కోట్లు కంపెనీలకు చెల్లించగా రైతులకు ఇచ్చిన బీమా పరిహారం కేవలం రూ.165 కోట్లు మాత్రమని తెలిపారు. కంపెనీల లాభం రూ.1605 కోట్లని, కేంద్ర ప్రభుత్వం తన వాటాగా ప్రీమియం చెల్లించక పోవడంతో రైతులకు పరిహారం రైతులందరికీ అందలేదని తెలిపారు.పంటల బీమా నష్టపోయిన రైతులను ఆదుకునే కంటే కంపెనీలకు లాభాలను కట్టబెట్టే పథకంలా ఉందని విమర్శించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్