ఆదివారం, 29 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కాకినాడ జిల్లాలో ఉదయం 11 గంటలకు 58.43 శాతం పోలింగ్

15 నిమిషాల క్రితం

కాకినాడ జిల్లాలో ఉదయం 11 గంటలకు 58.43 శాతం పోలింగ్
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 29, 2026, 12:05 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • 2,33,014 మంది ఓటర్ల ఓటు హక్కు వినియోగం

  • గండేపల్లిలో అత్యధికంగా 69.78 శాతం పోలింగ్

  • కాజులూరులో అత్యల్పంగా 31.27 శాతం నమోదు

ప్రజాశక్తి - కాకినాడ ప్రతినిధి : కాకినాడ జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఆదివారం ఉదయం 11 గంటల వరకు జిల్లావ్యాప్తంగా 58.43 శాతం పోలింగ్ నమోదైనట్లు జిల్లా ఎన్నికల అధికారులు వెల్లడించారు. మొత్తం 3,98,805 మంది ఓటర్లకు గాను 2,33,014 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

జిల్లాలోని కాకినాడ, పెద్దాపురం డివిజన్ల పరిధిలో మొత్తం 149 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా, 20 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 129 గ్రామ పంచాయతీల్లో పోలింగ్ కొనసాగుతోంది.

మండలాల వారీగా పోలింగ్ శాతాన్ని పరిశీలిస్తే పెద్దాపురం డివిజన్‌లోని గండేపల్లి మండలంలో అత్యధికంగా 69.78 శాతం పోలింగ్ నమోదైంది. కాకినాడ డివిజన్‌లోని పిఠాపురం మండలం 66.61 శాతంతో రెండో స్థానంలో నిలిచింది. జగ్గంపేట మండలంలో 65.49 శాతం, పెదపూడి మండలంలో 63.58 శాతం, గొల్లప్రోలు మండలంలో 62.83 శాతం, ఉ.కొత్తపల్లి మండలంలో 57.99 శాతం, కిర్లంపూడి మండలంలో 54.55 శాతం పోలింగ్ నమోదైంది. కాకినాడ డివిజన్‌లోని కాజులూరు మండలంలో అత్యల్పంగా 31.27 శాతం పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం సమయానికి పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉండటంతో అధికారులు ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్