ఆదివారం, 29 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఓటింగ్‌లో మహిళల జోరు.. రెండు గంటల్లో రెట్టింపైన పోలింగ్

12 నిమిషాల క్రితం

ఓటింగ్‌లో మహిళల జోరు.. రెండు గంటల్లో రెట్టింపైన పోలింగ్
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 29, 2026, 12:08 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ఉదయం 11 గంటలకు 59.83 శాతం పోలింగ్ నమోదు

  • రంగంపేటలో అత్యధికంగా 65.37 శాతం

  • 10 మండలాల్లో 1,618 పోలింగ్ కేంద్రాలు

  • 4.90 లక్షల మంది ఓటర్లకు గాను 2.93 లక్షల మంది ఓటు హక్కు వినియోగం

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి : తూర్పు గోదావరి జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ వేగంగా ఊపందుకుంది. ఉదయం 9 గంటలకు 29.20 శాతంగా ఉన్న పోలింగ్ శాతం 11 గంటలకు 59.83 శాతానికి చేరింది. రెండు గంటల్లోనే పోలింగ్ దాదాపు రెట్టింపు కావడం గమనార్హం. జిల్లాలోని 10 మండలాల పరిధిలో ఏర్పాటు చేసిన 1,618 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

ఉదయం 11 గంటల సమయానికి మొత్తం 4,90,780 మంది ఓటర్లకు గాను 2,93,651 మంది ఓటు వేశారు. వీరిలో మహిళలు 1,51,331 మంది, పురుషులు 1,42,320 మంది ఉన్నారు. పోలింగ్‌లో మహిళా ఓటర్లు పురుషుల కంటే ముందంజలో నిలిచారు.

మండలాల వారీగా పోలింగ్ శాతాన్ని పరిశీలిస్తే రంగంపేటలో అత్యధికంగా 65.37 శాతం నమోదైంది. బిక్కవోలులో 63.66, గోపాలపురంలో 63.22, నల్లజర్లలో 60.84, గోకవరంలో 60.10 శాతం పోలింగ్ నమోదైంది. రాయవరంలో 59.91, దేవరపల్లిలో 59.19, అనపర్తిలో 58.39 శాతం పోలింగ్ నమోదైంది. కాపిలేశ్వరపురంలో 55.23, మండపేటలో 55.40 శాతం పోలింగ్ నమోదైంది. ఈ రెండు మండలాల్లో పోలింగ్ శాతం జిల్లాలోని ఇతర మండలాలతో పోలిస్తే తక్కువగా ఉంది. జిల్లావ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్