ఆదివారం, 29 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రకృతి అందాలే నా బొమ్మలకు స్ఫూర్తి!

19 నిమిషాల క్రితం

బొమ్మ 2(3).jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 29, 2026, 12:01 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

హాయ్ ఫ్రెండ్స్‌!

నాకు బొమ్మలేయటం అంటే ఎంతో ఇష్టం. తెల్లటి కాగితం కనిపిస్తే చాలు.. నా మనసులో ఎన్నో ఊహలు మెదులుతుంటాయి. వెంటనే రంగు రంగుల పెన్సిళ్లు తీసుకుని చిట్టి చిట్టి పూలు, అందమైన చెట్లు, చందమామ, చిలకమ్మ, సీతాకోకచిలుకల బొమ్మలు వేస్తుంటాను. వాటికి అందమైన రంగులు అద్దుతుంటే నా మనసు ఆనందంతో నిండిపోతుంది. మన ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో కదా! ఉదయాన్నే తూర్పున ఉదయించే ఎర్రని సూర్యుడు, ఆకాశంలో తేలియాడే తెల్లని మేఘాలు, పచ్చని చెట్లు, వాటిపై వాలే రంగురంగుల పక్షులు చూడముచ్చటగా ఉంటాయి. సీతాకోకచిలుక రెక్కలకు రకరకాల రంగులు వేస్తాను. రాత్రివేళ ఆకాశంలో మెరిసే చందమామను, మిణుకు మిణుకుమనే నక్షత్రాలను కూడా నా కాగితంపై చిత్రిస్తాను. నా బొమ్మల్లో ప్రకృతి అందాలన్నీ కొలువుదీరుతాయి. ఒక్కో బొమ్మ వేస్తున్నప్పుడు నాకు కొత్త కొత్త ఆలోచనలు వస్తుంటాయి. ఆడుకుంటూ బొమ్మలు వేస్తాను. ఆనందంగా చదువుకుంటాను. నేను గీచిన బొమ్మలను అమ్మానాన్నలకు, స్నేహితులకు చూపిస్తుంటాను. వారు మెచ్చుకుంటే నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. ప్రకృతిని చూస్తూ కొత్త విషయాలు నేర్చుకోవడం, వాటిని నా బొమ్మల్లో చూపించడం నాకు చాలా ఇష్టం. నా కుంచెతో అందమైన రంగుల ప్రపంచాన్ని సృష్టించాలని, మరెన్నో మంచి బొమ్మలు వేయాలని కోరుకుంటున్నాను.

బొజ్జ శాన్విక ఒకటివ తరగతి ఆంబిటస్ స్కూల్ విజయవాడ.jpg


బొజ్జ శాన్విక

1వ తరగతి,

ఆంబిటస్ ఇంటర్నేషనల్‌ స్కూల్,

విజయవాడ.​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్