ఆదివారం, 16 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ముగిసిన టెట్‌

1 గంట క్రితం

tet
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 16, 2026, 08:16 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌)-2026 ముగిసింది. ఈ నెల 5 నుంచి ఆదివారం జరిగిన పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని టెట్‌ ‌కన్వీనర్‌ ఎంవి కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. చివరి రోజైన ఆదివారం మొదటి సెషన్‌‌లో నిర్వహించిన పేపర్‌-2ఎ ‌మ్యాథ్స్‌, సైన్స్‌‌ను 61 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించామని తెలిపారు. రెండో సెషన్‌‌లో నిర్వహించిన పేపర్‌-2ఎ లాంగ్వేజ్‌(ఇంగ్లీష్‌)ను 65 కేంద్రాల్లో జరిగాయని పేర్కొన్నారు. మొత్తంగా 11 రోజుల పాటు ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్‌‌లో 103 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించామని తెలిపారు. మొత్తం 2,38,252 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 2,18,254 మంది అభ్యర్థులు (91.61శాతం) హాజరయ్యారని వెల్లడించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్