ఆదివారం, 20 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కరీంనగర్‌లో ఒకేరోజు రెండు ఏటీఎంల్లో చోరీ

1 గంట క్రితం

atm.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 20, 2026, 09:39 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • గ్యాస్‌ కట్టర్‌తో ధ్వంసం చేసి నగదు అపహరణ

కరీంనగర్‌ : కరీంనగర్‌ జిల్లాలో ఒకేరోజు రెండు ఏటీఎంల్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. దుర్శేడు, తిమ్మాపూర్‌లోని ఏటీఎంలను గ్యాస్‌ కట్టర్‌తో ధ్వంసం చేసి నగదు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. దుర్శేడులోని ఏటీఎంలో చోరీకి పాల్పడిన ఇద్దరు దుండగులు సీసీ కెమెరాలపై స్ప్రే చల్లినట్లు పోలీసులు గుర్తించారు. వారిలో ఒకరు మహిళ ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. దుండగులు తలకు టోపీ, కళ్లద్దాలు, ముసుగు ధరించి చోరీకి పాల్పడ్డారు. సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్