10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మహిళల టీమ్ ఈవెంట్‌లో రజతం
2026 ఆసియా క్రీడల్లో భారత్ తొలి పతకాన్ని సాధించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్‌లో ఎలవెనిల్ వలరివన్, సోనమ్ మాస్కర్, విదార్షా కె. వినోద్‌తో కూడిన భారత జట్టు రజత పతకం గెలుచుకుంది. 1898.0 పాయింట్లతో భారత్ రెండో స్థానంలో నిలిచింది.
1904.2 పాయింట్లతో చైనా స్వర్ణ పతకం సాధించగా.. జపాన్ కాంస్య పతకం దక్కించుకుంది. కాగా ఎలవెనిల్ వలరివన్, సోనమ్ మాస్కర్ వ్యక్తిగత 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలోనూ ఫైనల్‌కు అర్హత సాధించారు. వ్యక్తిగత విభాగం ఫైనల్ ఉదయం 11 గంటలకు జరగనుంది.








కామెంట్‌లు (0)